న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.)
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంక్ మోసం కేసు (bank fraud case)లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌కు సంబంధించిన కంపెనీలు, ఇతర ప్రాంతాల్లో సీబీఐ శనివారం సోదాలు చేపట్టిందని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. అనిల్ గ్రూప్ కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ఇప్పటికే ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం ఆయన్ను 10 గంటల పాటు ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ