విశాఖపట్నం,, 23 ఆగస్టు (హి.స.)
:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ (సరూర్‌నగర్) కిడ్నీ రాకెట్ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన వైద్యుడిని సీఐడీ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ 19 మందిని అరెస్టు చేసినట్టయింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పవన్ అనే వ్యక్తిది కూడా విశాఖపట్నమే. ఆయనను ఇప్పటికే అరెస్టు చేయగా.. శుక్రవారం నగరానికి చెందిన డాక్టర్ వెంకటరామ సంతోషనాయుడిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసింది. కిడ్నీ ఇచ్చిన ఒకరు... ముందుగా చెప్పినట్టు డబ్బు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు విచారణలో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా పెద్దఎత్తున కిడ్నీ రాకెట్‌ను నడిపినట్టు పోలీసులు గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ కేసును సీఐడీ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ