: కాకినాడ జిల్లా , 23 ఆగస్టు (హి.స.)
పెద్దాపురంలో ఈరోజు ( ఆగస్టు 23న) ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక పదో వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ను పరిశీలించిన తర్వాత స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు.
అలాగే, ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. వర్చువల్ గా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం టీడీపీ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ