సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపైచర్చ
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నేడు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నేడు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చించినట్టు సమాచారం.

త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నారు. స్థానికంగా పార్టీ కోసం కష్టపడేవారికి నామినేటెడ్ పోస్టులు కట్టబడితే.. వారంతా పార్టీ కోసం మరింత కష్టపడతారని భావిస్తున్నారు. అలాగే పార్టీ సంస్థాగణ నిర్మాణంపై కూడా దృష్టిపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లి.. పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande