హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
యూరియా సరఫరా విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాతో మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి మరో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరినట్లు చెప్పారు. రావాల్సిన వాటా తప్పకుండా పంపిస్తామని చెప్పారు. సాంకేతిక కారణాలతో రామగుండంలో యూరియా ఉత్పత్తి ఆగిపోయిందన్నారు.
ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని కమిషన్ నివేదికపై ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసుతో బీజేపీకి సంబంధం లేదన్నారు. పార్టీలు మారడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తోందని కొత్త లైన్ వేసేందుకు ఎల్ అంట్ డీ సుముఖంగా లేదన్నారు. మెట్రో రెండోదశకు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ (ఎస్ఐఆర్) సరవణ జరగాలని కిషన్ రెడ్డి అన్నారు. సవరణ జరిగితే హైదరాబాద్ లో 4 లక్షల ఓట్లు తొలగించాలన్నారు. హైదరాబాద్ లో డబుల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయన్నారు. మేం ఓట్ల చోరీ చేస్తే మా ఎంపీ సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. బిహార్ లో బీజేపీకి అనుకూల వాతావరణంఉందన్నారు. రాహుల్ పాదయాత్ర ఎందుకో వారికే తెలియదన్నారు. బిహార్ లో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..