పిఠాపురం, 23 ఆగస్టు (హి.స.)
కొత్తపల్లి, : ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకగా 14వేల చీరలు పంపించారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ, జనసేన పార్టీ నాయకులు కలిసి.. మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలను శుక్రవారం అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో ఐదు బృందాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి వేలసంఖ్యలో మహిళలు ఆలయానికి పోటెత్తారు. అంతకుముందు పద్మజ.. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకుని అనంతరం వ్రతాల్లో పాల్గొన్నారు. ఆలయ ఈఓ జగన్‌మోహన్ శ్రీనివాస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ