ప్రమాదకరంగా ఉన్న కేబుల్ తీగలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు..
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.) కేబుల్ తీగల విషయంలో జిహెచ్ఎంసి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.ప్రమాదకరంగా ఉన్న కేబుల్ తీగలను వారు తొలగిస్తున్నారు. ఇటీవల కేబుల్ తీగలతో విద్యుదాఘాతమై ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్
కేబుల్ వైర్లు


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.) కేబుల్ తీగల విషయంలో జిహెచ్ఎంసి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.ప్రమాదకరంగా ఉన్న కేబుల్ తీగలను వారు తొలగిస్తున్నారు. ఇటీవల కేబుల్ తీగలతో విద్యుదాఘాతమై ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్ లో రోడ్ నెంబర్ 28 లో కేబుల్ తీగలను శనివారం తొలగించారు. విద్యుత్ శాఖ డీఈ రమేష్ చంద్ర, ఏడీ అంబేద్కర్, ఏఈ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న ఇంటర్నెట్ వైర్స్, కేబుల్ వైర్స్ ను తొలగించారు. వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా తక్షణమే విద్యుత్ శాఖ స్పందించి కేబుల్ వైర్స్ తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande