రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్‌
శ్రీకాకుళం, 23 ఆగస్టు (హి.స.): ఆముదాలవలసలో మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు.
Seetaram


శ్రీకాకుళం, 23 ఆగస్టు (హి.స.): ఆముదాలవలసలో మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, తమ్మినేని సీతారాం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ్మినేని సీతారాంను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.

కాగా, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande