పచ్చి వెల్లుల్లి తింటే ఏమౌతుందో తెలుసా..? షాకింగ్ విషయాలు మీకోసం..!
కర్నూలు, 23 ఆగస్టు (హి.స.) వంటల్లో రుచి కోసం వాడే వెల్లుల్లిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకులు దీనిని ఆహారంలో చేర్చుకోవడానికి ముఖ్య కారణం ఇదే. ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చి వెల్లుల్లి తింటే దానిలోని పోషకాలు మన శరీరాని
Garlic Secrets: Protect Your Heart and Brain Naturally


కర్నూలు, 23 ఆగస్టు (హి.స.)

వంటల్లో రుచి కోసం వాడే వెల్లుల్లిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మన పూర్వీకులు దీనిని ఆహారంలో చేర్చుకోవడానికి ముఖ్య కారణం ఇదే. ఉడికించిన వెల్లుల్లి కంటే.. పచ్చి వెల్లుల్లి తింటే దానిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లిలో ముఖ్యంగా అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ వైరల్ లక్షణాలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మనల్ని కాపాడతాయి.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి.. అలిసిన్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయి.

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.. మధుమేహ వ్యాధి ఉన్నవారికి వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది.

మెదడు ఆరోగ్యానికి మేలు.. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచి.. వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారిస్తాయి.

శరీరాన్ని శుభ్రం చేస్తుంది.. వెల్లుల్లి శరీరంలో ఉండే సీసం, ఆర్సెనిక్ వంటి హానికరమైన లోహాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ బాగా విడుదల అవుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

గుండెకు రక్షణ.. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande