మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కు రూ.375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.) మూసీ ప్రక్షాళణకు తెలంగాణ సర్కార్ తొలి అడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కు రూ.375 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళనను ప
తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

మూసీ ప్రక్షాళణకు తెలంగాణ సర్కార్

తొలి అడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కు రూ.375 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. ప్రస్తుతం మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నిధుల విడుదలతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. వరకు

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande