హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తాందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రంగనాథ్ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సి ఉందన్నారు. హైడ్రా ఒకటి, రెండేళ్లకు పరిమితం కాదన్నారు. ప్రారంభంలో హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. హైడ్రా ఏర్పాటులో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి ఇలాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు.
ఫాతిమా కాలేజీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా కాలేజీ 2015-16 లో నిర్మించారు. చారిటీ అనేది సెంకడరీ ఇష్యూ అన్నారు. నగరంలో 900కంటే ఎక్కువ చెరువులు ఉంటే వాటిలో అత్యధిక భాగం చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదని అందులో సలకం చెరువు కూడా ఉందన్నారు. తాము కూల్చివేస్తే ఎవరైనా కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని అందువల్ల చెరువుల హద్దుల విషయంలో శాస్త్రీయమైన నిర్ధారణ కోసం డేటాను కలెక్ట్ చేస్తున్నామన్నారు. ఎన్ కన్వెషన్ విషయం వేరు అని అక్కడ దుర్గం చెరువుకు 2015లోనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిందని అందువల్లే ఇక్కడ తాము కూల్చివేశామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్