జనగామ, 23 ఆగస్టు (హి.స.)
గ్రామీణ ప్రాంతాల యువతకు, మహిళలకు క్రీడల్లో ఆసక్తిని పెంచే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ వేడుకలని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జనగామలోని మినీ స్టేడియంలో శనివారం ఈషా ఫౌండేషన్ నిర్వహించిన 17వ గ్రామోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామోత్సవం కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, అలాగే యువత, మహిళల సమగ్ర ఆరోగ్యాభివృద్ధికి, వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి మంచి ప్రయత్నమన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు