ఎస్బీఐ లో జరిగిన భారీ స్కాంలో సూత్రధారి బ్యాంకు క్యాషియర్..
మంచిర్యాల, 23 ఆగస్టు (హి.స.) మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఎస్బిఐ బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో గల్లంతైన బంగారం మరియు నగదుకు ప్రధాన సూత్రధారి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న క్యాషియర్ రవీందర్ అని మంచిర్యాల పట్టణ పో
ఎస్బిఐ స్కాం


మంచిర్యాల, 23 ఆగస్టు (హి.స.)

మంచిర్యాల జిల్లా చెన్నూరు

పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఎస్బిఐ బ్యాంకులో జరిగిన భారీ స్కాంలో గల్లంతైన బంగారం మరియు నగదుకు ప్రధాన సూత్రధారి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న క్యాషియర్ రవీందర్ అని మంచిర్యాల పట్టణ పోలీసులు తేల్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి పట్టణంలో ఎంతో సెన్సేషనల్గా మారిన బ్యాంకు స్కాం తెరపడిందని, బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకులో 12 కోట్ల 60 లక్షల బంగారంతో పాటు 1 కోటి 10 లక్షల నగదు స్కామ్ జరిగినట్లు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఆడిట్ నివేదిక ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ భారీ స్కాంలో ప్రధాన సూత్రధారి బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న రవీందర్ అని ఆయన తెలిపారు. నిందితుడు గత మూడు రోజుల నుంచి పరార్లో ఉన్నాడని, అతన్ని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతనితో పాటు మరో 9 మంది అనుమానితులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande