మేడ్చల్ మల్కాజ్గిరి.23 ఆగస్టు (హి.స.)
వినాయక చవితి ఉత్సవాలలో
భాగంగా నిమజ్జనం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ, భక్తులకు ఏలాంటి అసౌర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. శనివారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల తనిఖీ లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తా, మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి లతో కలిసి శామీర్ పేట్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడూతూ.. గతంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ ఈసారి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు పరిసరాలలో నీటి మట్టం తక్కువగా ఉన్నందున నీటి మట్టం ఎక్కువగా ఉన్న మధ్య భాగంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు