ములుగు, 23 ఆగస్టు (హి.స.)
ములుగు నియోజకవర్గంలోని అన్ని
గ్రామాలలో నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ములుగు మండలంలో బండారుపల్లి గ్రామంలో 29 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేగ కళ్యాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారులను విస్తరణ పరచడం జరుగుతున్నదని అన్నారు.
రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు