నాగర్ కర్నూల్, 23 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భయపడే ప్రసక్తే లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ పౌరుషం ఉన్నోళ్లం.. గాజులు పెట్టుకొని కూర్చోలేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టారు.. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. నాగర్కర్నూల్ జిల్లాలోని కొంత మంది పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు.. రేపు మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు