అక్రమ వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్ సిపి కొరడా...
నిజామాబాద్, 23 ఆగస్టు (హి.స.) అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట
నిజామాబాద్ పోలీస్


నిజామాబాద్, 23 ఆగస్టు (హి.స.)

అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో దాడులు నిర్వహించారు. వడ్డీ వ్యాపారాలు చేస్తున్నవారి వివరాలను ముందుగానే సేకరించిన పోలీస్ అధికారులు.. వారి ఇండ్లతోపాటు ఫైనాన్స్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు.

ఈ సందర్భంగా వడ్డీ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయా లేవా అనే పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి వివరాలను నమోదు చేసి, వారిపై కేసులు పెట్టేందుకు పోలీస్ కమిషనర్ రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande