హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై చర్చించారు. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని సూచిస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కారు పార్టీ భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..