హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకుని బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. సహస్ర హత్యను కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. “బాలిక సహస్రను ఎంతో బాగా పెంచిన తల్లిదండ్రులు ఇంతటి దుర్ఘటనను ఎదుర్కోవడం బాధాకరం. కూకట్‌పల్లి పోలీసులు వేగంగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకోవడం ప్రశంసనీయ విషయం. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ‘సహస్ర చట్టం’ రూపంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి. భవిష్యత్తులో ఏ చిన్నారి ప్రాణం ఇలా బలైపోకూడదు,” అని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు