'పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి': రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, 23 ఆగస్టు (హి.స.) పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల
రాజన్న కలెక్టర్


రాజన్న సిరిసిల్ల, 23 ఆగస్టు (హి.స.)

పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో మట్టి గణపతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరణ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో 2,000 మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఇట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని సూచించారు.

వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఆది దేవుడైన వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande