మహబూబ్నగర్, 23 ఆగస్టు (హి.స)
తెల్లారింది మొదలు యూరియా కోసం పనులన్నీ వదులుకొని రైతులు కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది.
శనివారం ఉదయం మహబూబ్నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం వద్దకు యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ రైతుకు ఫిట్స్ రావడంతో కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. స్వయంగా ఆ రైతును అంబులెన్స్ లోకి ఎక్కించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు