అనంతపురం, 23 ఆగస్టు (హి.స.):ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట, స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ