నెల్లూరు, 23 ఆగస్టు (హి.స.)
:కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి హత్యకి కుట్ర, హత్యాయత్నం కేసులో A5 నిందితుడిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని చేర్చారు పోలీసులు. గత నాలుగు రోజులుగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న రామిరెడ్డి, మరో ఇద్దరు రౌడీషీటర్ల కోసం మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బెంగుళూరులో రామిరెడ్డి, అతడి అనుచరులు పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి వారంతా మైసూరుకు మకాం మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. రామిరెడ్డి దేశం విడిచి వెళ్లకుండా శనివారం లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే అవకాశముంది. కాగా, రామిరెడ్డిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల లిక్కర్ స్కాంలోనూ రామిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ