ఏపీ మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు.. టాపర్స్ ఎవరంటే..!
అమరావతి, 23 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎప్పుడూ డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన, ఇప్పుడు తన కేబినెట్‌లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధా
చంద్రబాబు నాయుడు


అమరావతి, 23 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎప్పుడూ డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన, ఇప్పుడు తన కేబినెట్‌లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా, ఫైళ్ల పరిష్కార వేగం (ఫైల్ క్లియరెన్స్) ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు.

ర్యాంకుల జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు, ఈ ర్యాంకింగ్‌లో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ చివరి స్థానాల్లో ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande