మైసూరు, 23 ఆగస్టు (హి.స.) మైసూరు దసరా ఉత్సవాలు(Mysore Dussehra celebrations) దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్‌ప్రైజ్ విజేత బానుముస్తాక్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బానుముస్తాక్ రచించిన హృదయదీప రచనకు బుకర్‌ప్రైజ్ లభించిన విషయం తెలిసిందే.
సెప్టెంబరు 22నుంచి అక్టోబరు 2దాకా 11రోజులపాటు మైసూరులో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. దసరా ఉత్సవాలు మైసూరులో రెండు ప్రత్యేక విధి విధానాలతో జరుగుతాయి. ప్రారంభం రోజున ప్రత్యేక ఆహ్వానితులతోపాటు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, అధికారులు పాల్గొంటారు. చాముండేశ్వరిదేవికి పుష్పార్చన ద్వారా శ్రీకారం చుట్టే ఉత్సవాలలో ప్రతిరోజూ సాహిత్య, సాంస్కృతిక, నృత్య కళాప్రదర్శనలు ఉంటాయి.
జంబూసవారి రోజున 750 కేజీల బంగారు అంబారిపై చాముండేశ్వరిదేవిని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. పూల ప్రదర్శన, వస్తు ప్రదర్శనతోపాటు మైసూరు నగరమంతటా ప్రత్యేకమైన విద్యుద్దీపాల అలంకరణలు ఉంటాయి. ఎయిర్‌షో, హెలిటూరిజం వంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతాయి. మరోవైపు రాజసంప్రదాయంలో భాగంగా మైసూరుప్యాలెస్ లో యువరాజు యదువీర్ బంగారు సింహాసనంపై ఆశీనులై ప్రైవేట్ దర్బార్ నిర్వహిస్తారు. జంబూసవారి పూజ ప్యాలె్‌సలో ప్రత్యేకంగా జరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి