న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.)
బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కేసు నమోదైంది. ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. గడ్చిరోలీ ఎమ్మెల్యే మిలింద్ నరోటే ఫిర్యాదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధాని బిహార్ పర్యటన నేపథ్యంలో తేజస్వి యాదవ్ అభ్యంతరకర పోస్టు పెట్టారని నరోటే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఎమ్మెల్యే నరోటే ఫిర్యాదు మేరకు పోలీసులు తేజస్వి యాదవ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 (వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), సెక్షన్ (పరువుకు భంగం కలిగించడం), 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో అవమానించడం), సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ