ఆ చిన్నారితో ఆటలాడిన CM చంద్రబాబు.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
ఢిల్లీ, 23 ఆగస్టు (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అంటే సగటు ప్రభుత్వ అధికారి నుంచి సీనియర్ ఐఏఎస్‌ (IAS)లు, జడ్పీటీసీ నుంచి కేంద్ర మంత్రుల వరకు హడల్. ఆయన ఓ పని చెప్పాడంటే.. అది అయ్యేంత వరకు నిద్రపోని మనిషి. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు నెర
cm-chandrababu-playing-with-the-child-photos-go-viral-


ఢిల్లీ, 23 ఆగస్టు (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అంటే సగటు ప్రభుత్వ అధికారి నుంచి సీనియర్ ఐఏఎస్‌ (IAS)లు, జడ్పీటీసీ నుంచి కేంద్ర మంత్రుల వరకు హడల్. ఆయన ఓ పని చెప్పాడంటే.. అది అయ్యేంత వరకు నిద్రపోని మనిషి. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు నెరవేర్చేందుకు అవిశ్రాంతంగా కష్టపడుతూ.. తన వెంట ఉన్నవాళ్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్లే తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి చిన్న పిల్లలను చూస్తే.. అట్టే మంత్రముగ్ధుడైపోతాడు. వారిని ఆప్యాయంగా ఎత్తుకుని ఆడిస్తూ.. బాబు సందడి చేస్తుంటారు.

కాగా, అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. హస్తిన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇటీవలే రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు కుమారుడు జన్మించాడు. అక్కడ ఆ చిన్నారిని చూసిన చంద్రబాబు ఆయన ఒళ్లోకి తీసుకున్నారు. కాసేపు సరదాగా బాబుతో చంద్రబాబు ఆటలాడారు. అనంతరం రామ్మోహన్ నాయుడు కుంటుంబ సభ్యులతో సీఎం ముచ్చటించారు. అయితే, చిన్నారితో సీఎం చంద్రబాబు ఆటలాడిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande