జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మావోయిస్టులకు అనుకూల తీర్పులిచ్చారు
న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) కొచ్చిన్, చెన్నై: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ఆరోపించా
Amit Shah


న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.)

కొచ్చిన్, చెన్నై: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ఆరోపించారు. కేరళలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి.. 2011 డిసెంబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ‘సల్వాజుడుం’పై తీర్పు ఇచ్చారు. మావోయిస్టులపై పోరాటం చేసేందుకు ‘సల్వాజుడుం’ పేరుతోనో మరో పేరుతోనో గిరిజన యువకులను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించడం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ఆ తీర్పులో పేర్కొన్నారు. సల్వాజుడుం సభ్యులను నిరాయుధులను చేయాలని ఆదేశించారు. ఆయన అలా తీర్పు ఇచ్చి ఉండకపోతే, 2020 నాటికే మావోయిస్టు తీవ్రవాదం ముగిసి ఉండేది’’ అని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ రెడ్డి నక్సల్‌ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారు కాబట్టే అలాంటి తీర్పు వెలువరించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande