న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ఆగస్టు 29 – 30 తేదీలలో జరగనున్న 15వ భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి జపాన్ పర్యటనకు వెళ్లడం దీంతో కలిపి 8వ సారి, ఆ దేశ ప్రధానమంత్రి ఇషిబాతో ఇది మోడీకి మొదటి శిఖరాగ్ర సమావేశం కానుంది. దీని తర్వాత ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా పర్యటనలో ఉంటారు.
జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యంపై సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి ముఖ్యమైన అంశాలు చర్చకురానున్నాయి. దీనితో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
9
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ