న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.)
బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాకు చెందిన మహిళారైతు అంజుకుమారి ఇటీవలి పంద్రాగస్టు వేడుకల అతిథిగా రాష్ట్రపతి భవన్ విందుకు హాజరయ్యారు. ప్రధాని మోదీతోనూ ముచ్చటించారు. అవి నా జీవితంలో గర్వకారణమైన క్షణాలు అంటున్న అంజుకుమారి ఈ స్థాయికి చేరుకోడానికి దశాబ్దకాలం అహరహం శ్రమించారు. 2.5 ఎకరాల భూమిలో నూనెగింజలు, చిరుధాన్యాలు, పుట్టగొడుగులు, అరటి, బొప్పాయి సాగుచేస్తున్న ఈమె వీటి నుంచి ఇతర ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. ఇప్పుడు సేంద్రియ సాగు గురించి నేర్చుకోడానికి ఇరుగు పొరుగు రైతులు అంజు వద్దకు వస్తున్నారు. చిన్న గుడిసెతో మొదలైన ఈ ప్రయాణంలో మంచి ఇల్లు కట్టుకొని ఆర్థికంగానూ స్థిరపడ్డారు. భర్త రాంనరేశ్ రాయ్ అడుగడుగునా అండగా నిలిచి, తన సైకిలుపై పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లి మంజు చేత ఎంఏ కూడా పూర్తిచేయించడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ