ధర్మస్థల’ కేసులో కీలక మలుపు.. ఆ ముసుగు వ్యక్తి అరెస్టు
బెంగళూరు:న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మ
ధర్మస్థల


బెంగళూరు:న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం (Dharamasthala mass burials) ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు, ముసుగు వ్యక్తి భీమాను తాజాగా సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. అతడు అబద్ధాలు చెప్పి, ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే అతడు మాట మార్చిన సంగతి తెలిసిందే.

ధర్మస్థల పరిసరాల్లో 100కు పైగా శవాలు పూడ్చిపెట్టానని చెప్పిన భీమా చివరకు వాటి ఆనవాళ్లు చూపకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్‌ ప్రధాన అధికారి ప్రణబ్‌ మొహంతీ అతడిని విచారించారు. మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని ఈ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో అతడిని అరెస్టు చేసింది. నేడు ముసుగు వ్యక్తిని కోర్టులో హాజరుపర్చనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande