న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.)
ఉత్తరాఖండ్‌లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుంభవృష్టి (Cloudburst in Uttarakhand) కురిసింది. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది.
ఈ సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ (Uttarakhand) సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ