ఓట్ల చోరీపై ప్రధాని మోదీ మాట్లాడరేం?భగల్పూర్‌ సభలో రాహుల్‌ గాంధీ విసుర్లు
భగల్పూర్‌: న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి జరుగుతున్న యత్నాలపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎ
Rahul Gandhi


భగల్పూర్‌: న్యూఢిల్లీ: ,23 ఆగస్టు (హి.స.) ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి జరుగుతున్న యత్నాలపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. బిహార్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ ప్రారంభించిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ ఆరో రోజైన శుక్రవారం భగల్పూర్‌కు చేరుకుంది. అక్కడ నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ‘మీ ఓటును చోరీ చేసేందుకే ఎన్నికల సంఘంతో కలిసి ప్రధాని మోదీ, భాజపా బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ కసరత్తు చేపట్టారు. మీ ఓటు హక్కును హరించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం గయాజీ వచ్చిన ఆయన తన ప్రభుత్వ ఓట్ల చోరీ యత్నంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రంలో వరుసపెట్టి ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మణిపుర్‌ ఎన్నికలలో అక్రమాల గురించీ ప్రధాని మోదీ మౌనం వహించారని ఆక్షేపించారు. ఓట్ల చోరీ భారత రాజ్యాంగంపై దాడేనని పేర్కొన్నారు. బిహార్‌ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande