అనంతపురం.అర్బన్.ఎంఎల్ఏ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి నీ జూనియర్నెంటిబర్ ఫాన్స్ ముట్టడి
అనంతపురం, 24 ఆగస్టు (హి.స.) ,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తూ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిస
అనంతపురం.అర్బన్.ఎంఎల్ఏ  దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి నీ జూనియర్నెంటిబర్ ఫాన్స్ ముట్టడి


అనంతపురం, 24 ఆగస్టు (హి.స.)

,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తూ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande