గుంటూరు, 24 ఆగస్టు (హి.స.) గుంటూరు నగర శివారులోని మహాత్మాగాంధీ న్యూ ఇన్నర్ రింగ్‌రోడ్డులో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 99 అడుగుల ఎత్తైన పర్యావరణ హిత మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ ఛైర్మన్ మానుకొండ నరేంద్ర తెలిపారు. గంగానది నుంచి మట్టి తీసుకొచ్చి తమిళనాడు, పశ్చిమబెంగాల్, హైదరాబాద్ ప్రాంత కళాకారులతో విగ్రహాన్ని రూపొందించినట్లు తెలిపారు. చవితి రోజు నుంచి 21 రోజుల పాటు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో పూజలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడా హోమాలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహ రూపకల్పనతోపాటు పూజా కార్యక్రమాలన్నింటినీ పర్యావరణ హితంగానే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు నగర శివారులోని మహాత్మాగాంధీ న్యూ ఇన్నర్ రింగ్‌రోడ్డులో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 99 అడుగుల ఎత్తైన పర్యావరణ హిత మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ ఛైర్మన్ మానుకొండ నరేంద్ర తెలిపారు. గంగానది నుంచి మట్టి తీసుకొచ్చి తమిళనాడు, పశ్చిమబెంగాల్, హైదరాబాద్ ప్రాంత కళాకారులతో విగ్రహాన్ని రూపొందించినట్లు తెలిపారు. చవితి రోజు నుంచి 21 రోజుల పాటు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో పూజలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడా హోమాలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహ రూపకల్పనతోపాటు పూజా కార్యక్రమాలన్నింటినీ పర్యావరణ హితంగానే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ