దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ నెట్వర్క్ డౌన్.. సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) భారత దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్ టెల్ నెట్ వర్క్ మరోసారి డౌన్ అయింది. ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం కలిగిందని ఆదివారం భారీ సంఖ్యలో వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ
ఎయిర్టెల్


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

భారత దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్ టెల్ నెట్ వర్క్ మరోసారి డౌన్ అయింది. ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం కలిగిందని ఆదివారం భారీ సంఖ్యలో వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచే నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నామని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఈ ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 12:27 గంటల వరకు డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ లో 6,905 మంది ఫిర్యాదు చేశారు. 52 శాతం మంది సిగ్నల్ రావడం లేదని ఫిర్యాదు చేయగా, 31 మంది మొబైల్ ఇంటర్నెట్ శాతం ఉపయోగించు కోలేకపోతున్నామని మరో 17 శాతం మంది టోటల్ బ్లాక్ ఔవుట్ అయిందని ఫిర్యాదు చేశారు. ఇక గత వారం కూడా ఎయిర్ టెల్ నెట్ వర్క్ దేశంలోని పలు ప్రాంతాల్లో డౌన్ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande