హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. మూడుసార్లు రన్ వేపైకి వెళ్లగా.. మూడుసార్లు సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై ఫ్లైట్ ను నిలిపివేశాడు. దీంతో ఏమైందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళన చెందారు. సాంకేతిక లోపం తలెత్తిన విమానం శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిందిగా తెలుస్తోంది. విమానం ఆలస్యం కావడంతో 37 ప్రయాణికులుఅసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలున్న విషయాన్ని ముందు చూసుకోవడం తెలియదా అంటూ సంబంధిత ఎయిర్ లైన్స్ పై ఫైరవుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్