స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వాలి : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని చట్టపరంగా ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం వర్క
ఆర్ కృష్ణయ్య


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని చట్టపరంగా ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఊగిసలాడుతుందని విమర్శించారు. గతంలో బీహార్, జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఎందుకు అవలంబించడం లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు.

గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఆమోదింప చేసి జీవో జారీ చేయాలన్నారు. లేనిపక్షంలో అసెంబ్లీలో మరోసారి బీసీ బిల్లు పాస్ గవర్నర్ కు పంపితే ఆటోమేటిక్ గా పాస్ చేస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande