సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది.. ఈటెల రాజేందర్
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతోందన్నారు. ఎన్నికలను కాలయాపన చేసేందుకే సాకులు వెతుక్క
ఈటెల రాజేందర్


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ భయపడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఓటమి భయంతోనే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపుతోందన్నారు. ఎన్నికలను కాలయాపన చేసేందుకే సాకులు వెతుక్కుంటోందని ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ బైరామాల్ గూడలో బీజేపీ సోషల్ మీడియా, ఐటీ వర్క్ షాప్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించినట్లు అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయి. కానీ 'సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది' అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయని విమర్శించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని దీన్ని శత్రువులపై ప్రయోగించాలని తప్ప మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదని ఈటల అన్నారు. సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనదని అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande