అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి.. ఎమ్మెల్యే గడ్డం వినోద్..
మంచిర్యాల, 24 ఆగస్టు (హి.స.) బెల్లంపల్లి కాంటా కూడలిని అభివృద్ధి చేసే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టియుఎఫ్ఎడిసి కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపా
ఎమ్మెల్యే వినోద్


మంచిర్యాల, 24 ఆగస్టు (హి.స.) బెల్లంపల్లి కాంటా కూడలిని అభివృద్ధి చేసే నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టియుఎఫ్ఎడిసి కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయితే పట్టణంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు రవాణా సులభతరమవుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande