హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్ తెలంగాణను ఎదిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో వైద్యపరికరాల తయారీలో స్వయం ప్రతిపత్తే లక్ష్యంగా జరుగుతున్న బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం.. ఈ సందర్భంగా 'ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ -ది బయోడిజైన్' బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయని వాణిజ్యపరమైన ఎదురవుతున్నాయన్నారు. పన్నులు, ఈ యుద్ధాలు, అడ్డంకులు సమయంలో సరైన వేదిక తెలంగాణ అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..