ఏపీలో యూరియ లభ్యత సరఫరా పై సీఎం.చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్
అమరావతి, 24 ఆగస్టు (హి.స.) ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు
ఏపీలో యూరియ లభ్యత  సరఫరా పై సీఎం.చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్


అమరావతి, 24 ఆగస్టు (హి.స.)

ఏపీలోయూరియా లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులు తో కీలక సమీక్ష చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆర తీశారు..విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. యూరియా ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఎస్, డీజీపీ, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులకు సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వ్యవవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎరువుల ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.. మార్క్ ఫెడ్ ద్వారా ఎంత మేర ఎరువుల సరఫరా జరుగుతుందనే విషయాన్ని వివరాలతో అధికారులు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్కెఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande