సిద్దిపేట, 24 ఆగస్టు (హి.స.)
పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 10 వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు శాంతిభద్రతల తీసుకుంటామన్నారు. నిరంతరం పరిరక్షణ పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు శ్రమిస్తున్న సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు సెప్టెంబర్ 10వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ. అనురాధ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు