రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం- వైఎస్‌ షర్మిల
అమరావతి, 24 ఆగస్టు (హి.స.) ‘రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణణాతీతం. ఏ రైతును కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యథే’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు. కట్ట
వైఎస్ షర్మిల


అమరావతి, 24 ఆగస్టు (హి.స.) ‘రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణణాతీతం. ఏ రైతును కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యథే’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ‘తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు. కట్ట యూరియా కోసం రోజుల తరబడి రైతుకు ఎదురు చూపులు. రైతాంగం మీద కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? రైతు సేవా, మార్క్‌ఫెడ్‌, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్‌ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలి. రాష్ట్ర కోటా మేరకు వచ్చిన యూరియా స్టాక్‌ ఏమైంది? 6.34 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా చేరితే రైతులకు ఎందుకు కష్టాలు తప్పలేదు? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande