హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో పారిశుద్ధ్యం లోపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా లేక రైతులు, సరైన వైద్యం, ఇతర అందక ప్రజలు ఇబ్బందులు సదపాయాలు పడుతున్నా.. రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్యం లేక గ్రామాలు పడకేసినా పట్టించుకోవడం లేదని, ప్రజలు అంటువ్యాధుల బారిన పడేందుకు కారణమవుతోందన్నారు. తిమ్మాపూర్లో డెంగ్యూ బారినపడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారని, ఇంకా 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపూ కేసీఆర్ , బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శలు గుప్పించారు. మండలానికొక వైన్స్, బార్ పెడతామంటున్న ప్రభుత్వం.. రైతులకు యూరియా కొరతను తీర్చలేకపోతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మందు ఫుల్లుగా దొరుకుతుందని, మందులు మాత్రం నిల్గా ఉన్నాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్