కరీంనగర్.24 ఆగస్టు (హి.స.) కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నేటి జనహిత పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
పాదయాత్ర జరగబోయే మార్గంలో భద్రతా బలగాలను విస్తృతంగా మోహరించి నిఘా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి లోపం ఉండకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు