సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగిన నేత సురవరం.. కేటీఆర్..
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్
కేటీఆర్


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. మగ్దూం భవన్లో ఉన్న ఆయన పార్థీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్ రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యార్థినాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యాదర్శిగా ఏడేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించమంటే సామాన్యవిషయం కాదని చెప్పారు. సామాన్యుని నుంచి అసాధారణ నేతగా ఎదిగారని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande