వరంగల్, 24 ఆగస్టు (హి.స.)
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం మాత్రమే తన లక్ష్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రూ.3కోట్ల 69లక్షల అభివృద్ధి పనులకు ఆదివారం వారు శంకుస్థాప చేశారు. తన ఆలోచన అంతా ఏ గ్రామానికి ఏం చేయాలి, పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలనే ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలనీ, మిగతా సమయంలో అందరం కలిసి ప్రతీ గ్రామాన్ని, ప్రతీ తండాను అభివృద్ధి చేసుకోవాలని, అందుకు ప్రతీ ఒక్కరు కలిసి రావాలని కోరారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతీ గ్రామాన్ని, తండాను అభివృద్ధి చేయాలి, ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నాని ఆయన అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు