హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
ఎమ్మెల్యేగా 50 వేల మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధితో తీర్చుకుంటానని మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం వెంకటాపురం డివిజన్ చిత్తారయ్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రజితోత్సవం సందర్భంగా రూ. 12 లక్షలతో నిర్మించిన స్కూల్ రూమ్ ను కార్పొరేటర్ సబిత అనిల్ కిశోర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు పెరిగిన జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..