మేడ్చల్, 24 ఆగస్టు (హి.స.)
మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం పలికారు. ఆదివారం మేడ్చల్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలను ఆమె ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు